Kamareddy Moram Mining | పట్టపగలే దర్జాగా మొరం తవ్వకాలు.. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఓ విలీన గ్రామంలో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి అక్రమ మొరం వ్యాపారం దర్జాగా సాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Moram Mining | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని ఓ విలీన గ్రామంలో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి అక్రమ మొరం వ్యాపారం దర్జాగా సాగుతోంది. ఎస్పీ, కలెక్టరేట్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

Kamareddy Moram Mining | విలీన గ్రామంలోని ఊర చెరువులో..

ఊర చెరువును కొందరు యథేచ్ఛగా తోడేసి ట్రాక్టర్లతో గత మూడు రోజులుగా ట్రాక్టర్లలో మొరం తరలిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకుంటున్న కొందరు, ఆ మట్టిని కులసంఘాల భవనాలకు, వ్యక్తిగత ఇళ్ల ముందు వేసేందుకు వినియోగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో ట్రిప్ లోడుకు రూ. 500 వసూలు చేస్తూ రోజుకు వందకు పైగా ట్రిప్పులు తరలిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇంత బహిరంగంగా జరుగుతున్న అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు మౌనం వహించడంతో గ్రామంలో చెరువు క్రమంగా గుంతలమయంగా మారుతోంది. ప్రభుత్వ వనరులను ఇలా బహిరంగంగా దోచుకుంటున్నా చర్యలు లేకపోవడంతో రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Kamareddy Moram Mining

ఇది కూడా చదవండి..: SI Salute | కాంగ్రెస్ జెండాకు ఎస్సై సెల్యూట్..! ఆగహ్రం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *