అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government Schemes | ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (MLA Laxmikanta Rao) అన్నారు. నిజాంసాగర్(Nizamsagar) మండలంలో గురువారం పలు అభివృద్ది కార్యక్రమాలను డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లిఖార్జున్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
Government Schemes | మండలంలోని వడ్డేపల్లిలో..
మండలంలోని వడ్డేపల్లి(vaddepally) పాపేశ్వర ఆలయం నుండి నల్లగుట్ట తండావరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ (Scheduled Tribes Special Development) నిధుల ద్వారా ఈ నిర్మాణ పనులు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మండలంలో లబ్ధిదారులకు షాదీ ముబారక్ (Shaadi Mubarak), కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Police Insurance | పోలీసులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కోటిన్నర బీమా ప్యాకేజీ!

