Bellal GP Funds Misuse | జీపీలో నిధుల దుర్వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు

జీపీలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బోధన్ మండలం బెల్లాల్​ జీపీ గ్రామస్తులు ఆరోపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్ : Bellal GP Funds Misuse | జీపీలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బోధన్ (bodhan)​ మండలం బెల్లాల్​ జీపీ గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో(Prajavani Complaint) ఫిర్యాదు చేశారు.

Bellal GP Funds Misuse | నిధుల గోల్​మాల్​

బోధన్ మండలం బెల్లాల్​ గ్రామపంచాయతీ సర్పంచ్ పాలకవర్గం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని గ్రామస్తులు ప్రజావాణిలో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి  పెద్ద ఎత్తున నిధుల గోల్​మాల్​కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. హరితహారం మొక్కల పెంపకాన్ని అడ్డుగా చూపి నిధులు కాజేశారని.. అలాగే వాటర్​ పైప్​లైన్లు చెడిపోతే వాటిస్థానంలో కొత్తవి వేయించుకుండా ఉన్నవాటికే మరమ్మతులు చేయించి బిల్లులు పెట్టారన్నారు. పాడైపోయిన మోటార్ల విషయంలోనూ నిధులు ఎగ్గొట్టారన్నారు. జీపీ నిధులపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

ఇది కూడా చదవండి: Jogi Ramesh Allegations | నన్ను చంపాలని చూశారు.. మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు ఆరోపణలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *