అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Excise Police | కామారెడ్డి రైల్వే స్టేషన్లో (Kamareddy Railway Station) ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సంబల్పూర్ నుంచి పూణే వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో(Nagavali Express) ఎండు గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కామారెడ్డి ఎక్సైజ్ అధికారులు మంగళవారం రైలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Kamareddy Excise Police | 10.9 కిలోల గంజాయి స్వాధీనం
రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి రూ.5.80 లక్షల విలువైన 10.9 కిలోల ఎండు గంజాయిని(Drug Trafficking) స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్ మిశ్రా, మహారాష్ట్రకు చెందిన గణేష్ పండిత్‌గా గుర్తించారు. ఒడిశా రాష్ట్రం రాయ్‌ఘడ్ నుంచి నాందేడ్‌కు అక్రమంగా తరలిస్తుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ట్రెయినీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ చంద్ర, ఎస్సై శ్రీనివాస్, రావు, ఆర్పీఎఫ్ ఎస్సై, సిబ్బంది ఫరీద్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ మునవర్ ఘోరీ, రాజు, పవన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Uttarakhand : రుద్రప్రయాగలో అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో వరదల కారణంగా ఘాట్లు నీట మునిగాయి.