అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhadradri Ganja Seizure | భద్రాద్రి కొత్తగూడెం ( Bhadradri Kothagudem ) జిల్లాలో గంజాయి స్మగ్లర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. బూర్గంపాడు మండలం సారపాక సమీపంలో ఈగల్ ఫోర్స్ , స్థానిక పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి బయటపడింది.
Bhadradri Ganja Seizure | ప్రమాదకరమైన రీతిలో తరలింపు..
ఒక కంటైనర్ ట్రక్కులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. నిశితంగా పరిశీలించగా, కంటైనర్‌లో ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత చాకచక్యంగా ఒక రహస్య గదిని నిర్మించి, అందులో 525 కిలోల గంజాయిని దాచినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ. 2.62 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Bhadradri Ganja Seizure | ఒడిశా నుంచి యూపీకి..
విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రంలో గంజాయిని సేకరించి, ఉత్తరప్రదేశ్ (యూపీ)కు తరలిస్తున్నట్లు తేలింది. ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు వ్యక్తులను (వీరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Bhadradri Ganja Seizure | స్వాధీనం చేసుకున్న వస్తువులు..
ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు కంటైనర్‌తో పాటు ఒక బైక్, ఐదు సెల్‌ఫోన్లు , రూ. 10,570 నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Ambala Borewell Rescue | బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ