అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Counter | ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దాని నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, రైతుల సమస్యలను పక్కన పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమిటని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. దీనికి ఎక్స్ వేదికంగా మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఒకే సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబితే, ముఖ్యమంత్రి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారన్నారు. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజం అని ప్రశ్నించారు.
Harish Rao Counter | మభ్య పెట్టడానికి..

2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82 వేల కోట్లు అయితే, జూన్ 2026 నాటికే లక్షా 56 వేల కోట్లు, లక్షా 75 వేల కోట్లు ఎలా ఖర్చు చేశారని హరీశ్‌రావు ప్రశ్నించారు. బడ్జెట్లో లేని డబ్బును ఖర్చు చేశారా? లేక రైతులను మభ్యపెట్టడానికి కల్పిత లెక్కలు చెబుతున్నారా అని విమర్శించారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఓట్లు అడిగారని, ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల చెప్పడం రైతులను మోసం చేయడం కాదా అన్నారు.
Harish Rao Counter | రైతులే గుణపాఠం చెబుతారు
ఫేక్ ప్రచారం చేసుకోవడం కాదు.. రైతులకు ఇచ్చిన హామీల అమలు కావాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేకపోతే రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేశారో, అన్నదాతను ఎలా మోసం చేసారో చేర్చేందుకు అసెంబ్లీ మాత్రమే కాదు ఏ వేదికలోనైనా తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు.
దీనిని కూడా చదవండి : Revanth Reddy Remarks | రాష్ట్రంలో తాగుడు కల్చర్ తెచ్చిన కేసీఆర్ : సీఎం రేవంత్‌రెడ్డి