అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB raids | హనుమకొండ (Hanmakonda) జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ (ACB), విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఫోన్‌పే ద్వారా డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రార్లకు మామూళ్లు పంపినట్లు సమాచారం. ఇందులో నుంచి ఉన్నతాధికారులకు వాటాలు వెళ్లినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.
ACB raids | గతంలో సైతం..
హన్మకొండ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో సైతం ఏసీబీ సోదాలు జరిగాయి. డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రార్ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 3న సోదాలు జరిపారు. ఆ సయమంలో కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి రూ.45,500 స్వాధీనం చేసుకున్నారు. అదే ఆఫీస్‌లో 20 రోజుల వ్యవధిలో మరోసారి తనిఖీలు చేపట్టడం గమనార్హం. తాజా దాడులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
దీనిని కూడా చదవండి : Police Insurance | పోలీసులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కోటిన్నర బీమా ప్యాకేజీ!

