Government Hospital | పేదలు ప్రభుత్వాస్పత్రిలో సేవలను వినియోగించుకోవాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

పేదలు ప్రభుత్వాస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Government Hospital | పేదలు ప్రభుత్వాస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అనవసరంగా ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhannpal Suryanarayana) సూచించారు. నగరంలోని సుభాష్​నగర్​లోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్(CMRF) చెక్కులను పంపిణీ చేశారు.

Government Hospital | 20శాతం మాత్రమే చెల్లిస్తున్నారు..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ నిధులను కేవలం 20శాతం మాత్రమే చెల్లిస్తున్నారని, వీటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినా.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. కొత్త పెన్షన్లు లేవని, ఆరోగ్యశ్రీ బిల్లులు సరిగా రావడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రూ.500 గ్యాస్ సబ్సిడీ, ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్ ఏదీ అమలు కావడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలవుతున్నాయని చెప్పారు.

Government Hospital | ఆరోగ్య సమస్యలతో సంప్రదిస్తే..

ఆరోగ్య సమస్యలు ఉన్న పేదలు తమ కార్యాలయంలో సంప్రదిస్తే ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఉత్తమ చికిత్స అందేలా చూస్తామన్నారు. అలాగే హైదరాబాద్​లోని బీబీనగర్​లో గల ఏయిమ్స్​లో అత్యాధునిక వైద్య సేవలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే నిమ్స్​లో(NIMS) చికిత్స పొందే వారికి తన ద్వారా ఎల్ఓసీ అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, విజయ మల్లేష్ యాదవ్, జ్యోతి మురళి, కల్పే అర్చనా చిరంజీవి, సీనియర్ నాయకులు మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

dhan1

ఇది కూడా చదవండి : 51వ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *