Fake Mutton Hyderabad | తక్కువ ధరకు మటన్​ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు

మల్లేపల్లిలోని ఉస్మాన్ మీట్ షాప్‌పై హెచ్-ఫాస్ట్ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake Mutton Hyderabad | మటన్​ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో కిలో రూ.వెయ్యి వరకు అమ్ముతున్నారు. అయితే పలు దుకాణాల్లో తక్కువ ధరకు మటన్​ విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని పలువురు ఇక్కడ కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని దుకాణాల్లో నకిలీ మటన్​ను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

హబీబ్‌నగర్‌లోని మల్లేపల్లి (Mallepally) బడి మసీదు సమీపంలోని ఉస్మాన్ మీట్ షాప్‌పై హెచ్-ఫాస్ట్ అధికారులు, పోలీసులు బుధవారం రాత్రి దాడులు చేశారు. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకుని, యజమానిపై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన మాంసాన్ని టెస్టింగ్​కోసం ల్యాబ్​కు పంపారు. ఎద్దు మాంసం కలిపిన మటన్​ను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హోటళ్లు, ఫంక్షన్​లకు సప్లై చేస్తున్నట్లు తెలిపారు.

Fake Mutton Hyderabad | కుళ్లిన చేపలు స్వాధీనం

Fake Mutton Hyderabad

మంగళ్‌‌హాట్ పరిధిలోని ‘‘తార ఫిషరీస్” దుకాణంపై టాస్క్‌‌ఫోర్స్, పోలీసులు దాడి చేశారు. కుళ్లిన చేపలు, రొయ్యలు అమ్ముతున్న శంకర్ సింగ్(24), మాన్ సింగ్(32), గులాబ్ సింగ్(36), రోహిత్ సింగ్‌‌(31) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు బేగంబజార్ నుంచి తక్కువ ధరకు కుళ్లిన చేపలు, రొయ్యలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. అవి వాసన రాకుండా సోడియం పౌడర్ కలిపి నిల్వ చేస్తున్నారు. వీటిని హోటళ్లు, ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నారు. వారి నుంచి 162 కిలోల పాడైపోయిన చేపలు, 100 కిలోల కుళ్లిన రొయ్యలు, 10 కిలోల సోడియం బైకార్బోనేట్ స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Smart Traffic | ట్రాఫిక్​ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్​​ పని చేయాలి : సీఎం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *