Harish Rao Demand | జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయాలి : హరీశ్​రావు

మంత్రి జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Demand | మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao)కు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. కంచన్​బాగ్​ పోలీస్​ స్టేషన్​ నుంచి ఆయనతో పాటు ఇతర బీఆర్​ఎస్​ నాయకులను పోలీసులు విడుదల చేశారు.

హరీశ్​రావు తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని జూపల్లి కృష్ణారావు అన్నారన్నారు. ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేసింది అంటున్నారని విమర్శించారు. ఒక్కరోజులోనే లక్ష కోట్ల అప్పు తగ్గించారన్నారు. ఈరోజు చర్చకు వచ్చి ఉంటే రూ.4 లక్షల కోట్లు అని తేలిపోయేదని పేర్కొన్నారు.

Harish Rao Demand | తోక ముడిచాడు

కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే, జూపల్లి కృష్ణారావు తాను తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పారన్నారు. ఈరోజు సబ్జెక్ట్ లేక తోక ముడిచి వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. గురుకుల టెండర్లలో అవినీతి జరిగింది కాబట్టే తమను చర్చకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేయించారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చకు వస్తారంటే లేదు హరీష్ రావు రావాలి, గన్ పార్క్ వద్దకు రావాలి అన్నారని పేర్కొన్నారు. తాను వెళ్తుంటే అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు జరిగితే వారి బండారం అంతా బయటపడుతుందని భయంతో తమను అరెస్ట్ చేశారన్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Housing Tenders | క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *