అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Multiple Voter Registration | ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఓటర్ల జాబితాలో (Voter List) ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండడం, తప్పుడు సమాచారం ఇవ్వడం శిక్షార్హమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సూచించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
Multiple Voter Registration | చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం..
చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకుంటే చట్టపరంగా అనర్హుడని కలెక్టర్ పేర్కొన్నారు. సెక్షన్ 31 ప్రకారం ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల నమోదు లేదా తొలగింపుల సమయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే తీవ్రమైన నేరంగా పరిగణించ బడుతుందన్నారు. అటువంటి వారికి ఏడాది వరకు జైలుశిక్ష, లేదా జరిమానా.. లేదా ఈ రెండూ విధించబడతాయని తెలిపారు. ఓటర్లందరూ ఈ చట్టపరమైన నిబంధనలను విధిగా పాటించాలని, ఎవరికైనా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు లేదా వేర్వేరు ప్రాంతాలలో ఓట్లు ఉన్నట్లయితే, వెంటనే ఫారమ్-7 (Form-7) ద్వారా అదనపు ఓట్లను తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఇది కూడా చదవండి : #Hyderabad | ఉప్పర్పల్లి బార్బీక్యూ నేషన్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు