అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponguleti Development Works | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో అఫర్డ్‌బుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్ స్కీమ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై శనివారం సమీక్షించారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అయిందని మంత్రి తెలిపారు. ఇదే స్ఫూర్తిని క్యూర్ పరిధిలో చేపట్టబోయే అఫర్డ్‌బుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్‌పై కూడా చూపించాలన్నారు. క్యూర్ పరిధిలో పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Ponguleti Development Works | తొలి విడతలో 500 ఇళ్లు..
స్థలాలు గుర్తించిన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని పొంగులేటి సూచించారు. క్యూర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో తొలి విడతలో 500 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని ప్రకటించారు.
Ponguleti Development Works | శాశ్వత భవనాలు
రాష్ట్రంలోని 10 ఆర్డీవో, 107 తహశీల్దార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రెండు డీఐజీ, నాలుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్, 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ భవనాలన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో సోలార్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
దీనిని కూడా చదవండి : KCR Farmhouses | కేసీఆర్ కుటుంబానికి ఫామ్‌హౌజ్‌లు ఎక్కడివి : సీఎం రేవంత్‌రెడ్డి