Meta IT Notice | చిన్నారుల అశ్లీల వీడియోలు.. మెటాకు నోటీసులు జారీ చేసిన కేంద్రం

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రచారమవుతోందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Meta IT Notice | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ( Instagram )  వేదికగా చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రచారమవుతోందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ ‘మెటా’కు నోటీసులు జారీ చేస్తూ, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Meta IT Notice | ఏడు రోజుల్లో నివేదిక సమర్పించాలి..

ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSEAM) ఎలా అనుమతించబోతోందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మెటాను కోరింది. ఈ అసాంఘిక కంటెంట్‌ను అరికట్టడానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటో 7 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోపు సరైన సమాధానం రాకపోతే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT Act), పోక్సో (POCSO) చట్టం కింద మెటాపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

Meta IT Notice | అల్గారిథమ్‌పై కేంద్రం దృష్టి..

ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తున్న ‘అల్గారిథమిక్ యాంప్లిఫికేషన్’ (కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా ఎక్కువ మందికి చేరవేసే విధానం) కారణంగానే ఇటువంటి అశ్లీల వీడియోలు వైరల్ అవుతున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. ఈ అల్గారిథమిక్ లోపాలను వెంటనే సరిదిద్దాలని, అభ్యంతరకర కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని కేంద్రం ఆదేశించింది.

meta.1

Meta IT Notice | బీబీసీ సంచలన కథనంతోనే ప్రకంపనలు..

ఇన్‌స్టాగ్రామ్ భారత్‌లో అశ్లీలతను, ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన అసభ్యకర వీడియోలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో ‘బీబీసీ’ ఓ సంచలన కథనంలో వివరించింది. ప్లాట్‌ఫామ్ భద్రతా ప్రమాణాల్లోని తీవ్రమైన లోపాలను ఈ కథనం ఎండగట్టింది. దీనిపై ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మెటా సంస్థకు నోటీసులు పంపింది.

ఇది కూడా చదవండి:  Nizamabad Roads | నగరంలో అధ్వానమైన రోడ్లతో అవస్థలెన్నో..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *