Nizamabad Roads | నగరంలో అధ్వానమైన రోడ్లతో అవస్థలెన్నో..

నిజామాబాద్​ నగరం దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్​ అధికారులు విఫలమవుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Roads | నగరం(Nizamabad) దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్​ అధికారులు (Municipal Development) విఫలమవుతున్నారు. చిన్నపాటి వర్షానికే శివారు కాలనీల్లో రోడ్లన్నీ చిత్తడిచిత్తడిగా మారడంతో ఆయా కాలనీలవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

Nizamabad Roads | 8వ డివిజన్​లో..

నగరంలోని 8వ డివిజన్​లో శనివారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ(Bad Roads ) పూర్తిగా చిత్తడిగా మారాయి. పీఎఫ్​ కార్యాలయం వెనక ప్రాతంలోని సీతారాంనగర్​ కాలనీ, బంగారు మైసమ్మ రోడ్​ నం.1 ప్రాంతాల్లో మట్టిరోడ్లు ఉండగా.. వర్షానికి బురదమయంగా మారాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తయారైందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ రోడ్లపై నుంచి వెళ్తూ పలు వాహనాలు స్కిడ్​ అయి వాహనదారులు కిందపడిపోయారని పేర్కొన్నారు. అయితే తాము కార్పొరేటర్​ను సంప్రదించామని.. బంగారుమైసమ్మ రోడ్​నం.1కు సీసీ రోడ్డు మంజూరైందని పేర్కొన్నారన్నారు. కాంట్రాక్టర్​ అందుబాటులో లేకపోవడంతోనే సమస్య పరిష్కారం కావట్లేదని వారన్నారు.  రోడ్డు పనులు పూర్తి చేసి కాలనీవాసుల సమస్యను తీర్చాలని వారు కోరుతున్నారు.

road1

ఇది కూడా చదవండి: కేటీఆర్ కన్నెపల్లి పర్యటనను జనగామ జిల్లా కోమల్ల టోల్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వాగ్వాదం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *