Hormuz Transit Fee | ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో నౌకల ప్రయాణానికి ఇక ఛార్జీలు వసూలు

ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hormuz Transit Fee | ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ( Strait of Hormuz ) ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది. ఈ ప్రాంతం తమ ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉందని పేర్కొంటూ, ఇక్కడి నుంచి ప్రయాణించే నౌకల నుంచి ‘సేవా రుసుము’ వసూలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒమన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ వెల్లడించారు.

Hormuz Transit Fee | మిత్రదేశాలకు రాయితీలు..

ఈ టోల్ విధానంలో భాగంగా, తమకు మద్దతుగా నిలుస్తున్న మిత్రదేశాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ఇరాన్ భావిస్తోంది. భవిష్యత్తులో ఈ జలసంధిలోని నౌకల రాకపోకల పర్యవేక్షణ, రవాణా భద్రత , పర్యావరణ పరిరక్షణ వంటి బాధ్యతలను ఒమన్‌తో కలిసి ఇరాన్ నిర్వహించనుంది. ఈ జలమార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేశాల సైనిక విన్యాసాలకు వేదికగా కానివ్వమని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాది స్పష్టం చేశారు.
harmuz 1

 

Hormuz Transit Fee | నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..

ఇరాన్ నిర్దేశించిన నిబంధనలను పాటించని నౌకలపై ఇరాన్ ఇప్పటికే దృష్టి సారించింది. తాజాగా, నిర్ణీత మార్గంలో కాకుండా ఒమన్ తీరం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఎనిమిది నౌకలను అధికారులు వెనక్కి పంపినట్లు షిప్పింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య మార్గమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Hyderabad Metro Phase II | మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలి.. కేంద్రమంత్రులకు సీఎం లేఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *