అక్షరటుడే, కామారెడ్డి: BJP Strategy | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు (MPTC and ZPTC Elections) ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో (Raja Reddy Garden) శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని మండల, గ్రామ, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.
BJP Strategy | బూత్‌స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీ బలోపేతం అయినప్పుడే అన్ని ఎన్నికల్లో గెలవగలమని తెలిపారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ఈ ఎన్నికల్లో అందరు పోటీ చేసి గెలిచి కార్యకర్తలు నాయకులుగా అయ్యే అవకాశం ఉందన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో అవినీతి రహిత కామారెడ్డి (Kamareddy) కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నానని, దానికోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయటానికైనా తాను సిద్దమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుకు ఉద్యమం చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bear Attack | ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు.. రెడ్డిపేట స్కూల్ తండాలో ఘటన

