అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | కాంగ్రెస్‌లో మరోసారి మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు భగ్గు మన్నాయి. కడియం తీరుపై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ.. తాజాగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖకు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. గతంలో సురేఖ భర్త మురళి కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి పార్టీలోకి రావాలన్నారు. అయితే ఇటీవల వీరి మధ్య సయోధ్య కుదిర్చడానికి పార్టీ పెద్దలు యత్నించారు. త్వరలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కలిసి పని చేయాలని సూచించారు. ఈ మేరకు వరంగల్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి భోజనం కూడా చేశారు. అయితే అంతలోనే కడియం రివ్యూ మీటింగ్‌తో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Konda Surekha | దేవాదాయ శాఖ అధికారులతో..
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం వివాదాస్పదం అయింది. ఓ ఎమ్మెల్యే ఏకంగా రాష్ట్ర కార్యాలయంలో ఎండోమెంట్ కమిషనర్‌తో రివ్యూ చేశారు. ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియకుండా ఆయన సమీక్ష నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి పనులపై ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దీనిపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Konda Surekha | ముఖ్యమంత్రికి ఫిర్యాదు
ఈ వ్యవహారంపై కొండా సురేఖ ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాజాగా సీఎంకు లేఖ రాశారు. దేవదాయశాఖ మంత్రిగా తనను విస్మరించి సమీక్షలు పెడుతున్నారని, మాస్టర్‌ప్లాన్లు, నివేదికలపై ఆదేశాలివ్వడం మంత్రి పరధిలోని అంశం అన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఆమె కోరారు. కడియం శ్రీహరి నుంచి వివరణ కోరాలన్నారు.
Minister Konda Surekha written letter to cm revanth reddy on kadiam SRIHARI pic.twitter.com/145MxcdAak
— MAHESH REDDY G (@reach2gmr) July 7, 2026
దీనిని కూడా చదవండి : Transformer Coil Theft | ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ చోరీ ముఠా అరెస్ట్