అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan Fan Death | హనుమకొండ (Hanumakonda)కు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూశారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ను పవన్ కల్యాణ్ గత నెలలో పరామర్శించిన విషయం తెలిసిందే.
నిరంజన్‌కు జన్యు సంబంధ వ్యాధి రావడంతో ఎదుగుదల ఆగిపోయింది. ఆయన మంచానికే పరిమితం అయ్యాడు. అతడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న పవన్ గత నెలలో నిరంజన్ను పరామర్శించారు. కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారు. ‘ఓజీ 2’ సినిమాను కలిసి చూద్దామని హామీ ఇచ్చారు. అంతలోనే నిరంజన్ మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Pawan Kalyan Fan Death | ఆరోగ్యం క్షీణించడంతో ..
నిరంజన్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అరుదైన జన్యు సంబంధిత (Neuromuscular) వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచాడు. జూన్ 17న పవన్, నిరంజన్ను పరామర్శించారు. ఆప్యాయంగా మాట్లాడారు. అతడు ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ సాంగ్స్‌కు చేసిన డ్యాన్స్ వీడియోలను తల్లిదండ్రులు ఆయనకు చూపించారు. వాటిని చూసి పవన్ మురిసిపోయారు. నిరంజన్‌కు పలు బహుమతులతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy | మెస్సీ మ్యాజిక్‌కు మరోసారి హైదరాబాద్ ఫిదా.. విద్యార్థులతో కలిసి అర్జెంటినా మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్