Janakampet Goods Shed | రేపు జానకంపేట్​ గూడ్స్​ షెడ్​ జాతికి అంకితం.. ఎంపీ కృషితో పూర్తయిన నిర్మాణం

జానకంపేట వద్ద నిర్మించిన రైల్వే గూడ్స్ షెడ్ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం ఈ షెడ్​ను జాతికి అంకితం చేయనున్నట్లు ఎంపీ అర్వింద్​ ధర్మపురి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Janakampet Goods Shed | జిల్లాలో రైల్వేశాఖ ఆధ్వర్యంలో జానకంపేట(Janakampet) వద్ద నిర్మించిన రైల్వే గూడ్స్ షెడ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు 9న ఈ షెడ్​ను జాతికి అంకితం చేయనున్నట్లు ఎంపీ అర్వింద్​ (MP Arvind) ధర్మపురి పేర్కొన్నారు.

Janakampet Goods Shed | విపరీతమైన ట్రాఫిక్ కారణంగా..

నిజామాబాద్ నగరంలో రైల్వే స్టేషన్​లో(Nizamabad Railway Station) మూడు రైల్వేట్రాక్​లను ప్రయాణికుల రాకపోకలకు కేటాయించారు. నాలుగో ట్రాక్​ సైతం ఉండగా దాని మీదుగా గూడ్స్ రైళ్ల ద్వారా సరుకుల రవాణా జరుగుతూ ఉండేది. అయితే స్టేషన్​లో ఈ రవాణా కారణంగా నిత్యం వందలాది లారీలు వస్తూ పోతుండడంతో చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బందిగా మారింది. విపరీతమైన వాయు కాలుష్యం కూడా ఏర్పడింది. అలాగే రైల్వే ప్రయాణికులకు సైతం ఇబ్బందిగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులకు ఎంపీ అర్వింద్​ సమస్యను విన్నవించారు. సరుకుల రవాణాను జానకంపేట వద్ద గూడ్స్ షెడ్ నిర్మించి అక్కడికి మార్చాలని కోరారు. ఆయన కృషి ఫలితంగా ఇటీవల గూడ్స్​ షెడ్​ రూపు దిద్దుకుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా ట్రాక్​ను ఏర్పాటు చేసిన అధికారులు గూడ్స్ లోడింగ్ అన్​లోడింగ్​ అక్కడి నుంచే నిర్వహించనున్నారు. దీంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రవాణా రాకపోకలు త్వరలోనే నిలిచిపోనున్నాయి.

Janakampet Goods Shed | గతంలోనే ట్రయల్​ రన్​..

ఈ సరుకు రవాణాను జానకంపేట గూడ్స్ షెడ్​కు మార్చిన అధికారులు రెండునెలల క్రితం ట్రయల్​ రన్(Trial run)​ నిర్వహించారు. అక్కడి నుండి 21 వ్యాగన్లలో మొక్కజొన్న లోడ్​తో ఇతర రాష్ట్రాలకు రైలు వెళ్లింది. ఇది విజయవంతం కావడంతో షెడ్​ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి నిజామాబాద్​కు..అలాగే నిజామాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు యూరియా, బియ్యం ఇతర వస్తువులు లోడింగ్ అన్​లోడింగ్​ అంతా జానకంపేట గూడ్స్ షెడ్ నుంచే జరగనున్నాయి. ఈ మేరకు  రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గూడ్స్​ షెడ్​కు పూర్తిగా గూడ్స్​రైళ్లు వెళ్లిపోతే.. రైల్వే సమయాల్లో తేడాలు లేకుండా రైళ్ల రాకపోకలు సాగించే అవకాశం ఉంది.

రేపు జాతికే అంకితం..

గూడ్స్ షెడ్డును గురువారం ఎంపీ అర్వింద్​ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud), అంజిరెడ్డి, కొమరయ్య, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు.

Peddapalli Nizamabad Section

shed

ఇది కూడా చదవండి: ఇండోనేషియాలోని ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ప్రధాన మంత్రి #Narendramodi

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *