Tech Layoffs | బిగ్ షాక్.. 16 వేల మందికి ఉద్వాసన!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tech Layoffs | టెక్ కంపెనీలలో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence)పై పెట్టుబడులు పెంచేందుకు, నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను బలి చేస్తున్నాయి. తాజాగా మెటా 8 వేల మందిని, మైక్రోసాఫ్ట్ 8,750 మందిని తొలగించాలని నిర్ణయించాయి.

ఈ మేరకు బైఅవుట్ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించి, టెక్నికల్ టీమ్స్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కంపెనీలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Tech Layoffs | మెటాలో ఇంజినీర్లకే ప్రాధాన్యత

మెటా తన పనితీరును మార్చుకోవాలని నిర్ణయించుకుంది. కంపెనీలో అనవసరంగా ఉన్న మేనేజ్‌మెంట్ లేయర్లను తొలగించి, నేరుగా టెక్నికల్, ఇంజినీరింగ్ టీమ్స్‌ (Engineering Teams)కే పవర్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మేర అంటే 8 వేల మందిని తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతోపాటు 6 వేల ఖాళీలను ఇక భర్తీ చేయరు. ఏ ఏడాది చివరినాటికి మెటా ఖర్చులు 169 బిలియన్ డాలర్లకు చేరుతాయని అంచనా. ఈ భారీ వ్యయాలు ప్రధానంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారీ జీతాలతో రిక్రూట్ చేసుకుంటున్న ఏఐ నిపుణుల వల్లే పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు సాధారణ ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Tech Layoffs | మైక్రోసాఫ్ట్‌లో ‘వలంటరీ’ స్ట్రాటజీ

మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నేరుగా పింక్ స్లిప్ ఇవ్వకుండా సెటిల్‌మెంట్ ప్యాకేజీతో వలంటరీ రిటైర్‌మెంట్ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. యూఎస్‌లో ఉన్న తమ సిబ్బందిలో దాదాపు 7 శాతం మందిని తగ్గించుకోవడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మార్కెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా కంపెనీని సిద్ధం చేయడానికే ఈ మార్పులని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి టెక్ పరిశ్రమ (Tech Industry)లో ‘ఎఫీ¾షియన్సీ’ పేరుతో జరుగుతున్న ఈ లేఆఫ్స్ సాధారణ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *