అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | ఇస్కాన్ జగన్నాథ రథయాత్రకు భక్తులు భారీగా తరలిరావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం అందజేశారు.
Jagannath Rath Yatra | ఈనెల 24న రథయాత్ర..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. నగరంలోని కంఠేశ్వర్ ఆలయం నుంచి ఈ నెల 24న రథయాత్ర ఉంటుందన్నారు. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించే రథయాత్రలో ఇందూరు భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఇస్కాన్ సేవలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని కొనియాడారు. నీలకంఠేశ్వరాలయం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా తిరిగి కంఠేశ్వర్‌లోని శ్రీరామ గార్డెన్‌కు చేరుకుంటుందన్నారు. ఇస్కాన్ కంఠేశ్వర వ్యవస్థాపక అధ్యక్షుడు రామానంద రాయ్ గౌరదాస ప్రభుజీ, నిత్యాచాంద్ ప్రభుజీ, బలరాం ప్రభు జీ, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, సీనియర్ నాయకులు స్వామి యాదవ్, రఘుపతి గౌడ్, రోహిత్ ప్రభుజీ, సునీల్ ప్రభూజీ, భార్గవ్ ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Private Schools Notice | రెండు ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు..: పాఠ్యపుస్తకాల గదికి సీళ్లు..