అక్షరటుడే, కామారెడ్డి: Anganwadi Jobs | కామారెడ్డి (Kamareddy) జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు.
Anganwadi Jobs | జిల్లావ్యాప్తంగా 190 పోస్టులు..
మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ పరిధిలోని బాన్సువాడ (Banswada), దోమకొండ (Domakonda), కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, సహాయకురాలి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో మొత్తం 190 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అంగన్వాడీ టీచర్ పోస్టులు 95, అంగన్వాడీ సహాయకురాలి పోస్టులు 95 ఉన్నాయి. బాన్సువాడలో 46, దోమకొండలో 41, కామారెడ్డిలో 26, మద్నూర్ లో 35, ఎల్లారెడ్డిలో 42 పోస్టులు ఉన్నాయి. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారణి తెలిపారు.
Anganwadi Jobs | జూలై 9 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
దరఖాస్తు ప్రక్రియ జూలై 9 నుంచి ప్రారంభమై జూలై 25 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఆమె తెలిపారు. దరఖాస్తులు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని, హెల్పర్ పోస్టులకు 10వ తరగతి అర్హత సరిపోతుందని తెలిపారు. జూలై 1, 2026 నాటికి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అంగన్వాడీ కేంద్రానికి స్థానిక నివాసితులై ఉండాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్మీడియట్ మార్కులకు 70, ప్రత్యేక కేటగిరీలకు 20, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారని, ఎంపికైన అభ్యర్థులు జూలై 28 నుంచి ఆగస్టు 1 వరకు సంబంధిత ప్రాజెక్టు కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడం లేదా మార్పుల అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన భవనం..
Chakali lavanya.pet sangem village.gandhari Mandel .9391363435 mobile number