అక్షరటుడే, ఆర్మూర్: Teenmar Mallanna | ఆర్మూర్ (Armoor) కోర్టుకు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ మేరకు న్యాయస్థానం ఆయనను విచారించింది.
Teenmar Mallanna | కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు..
2020లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పై (KCR) తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు తీన్మార్ మల్లన్నపై ఆర్మూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా మల్లన్న ఆర్మూర్ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. తీన్మార్ మల్లన్న జూన్ 2024లో జరిగిన ఉపఎన్నికల్లో వరంగల్–ఖమ్మం–నల్గొండ(Nalgonda) పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్, క్వాన్జౌ, జిన్‌జియాంగ్‌లో ఉన్న ఓ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.