Banswada Student Suicide | విద్యార్థిని ఆత్మహత్య ఘటన.. వార్డెన్ సస్పెన్షన్​

పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో ఇంటర్ ఫస్టియర్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Student Suicide | పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో ఇంటర్ ఫస్టియర్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారు. ఘటనలో నిర్లక్ష్యం ఉన్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వార్డెన్ మమతను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Banswada Student Suicide | విచారణ అనంతరం..

ఈ ఘటనపై బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్‌ విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ (Collector Ashish Sangwan)కు సమర్పించారు. నివేదికను పరిశీలించిన కలెక్టర్ ఆదేశాల మేరకు వార్డెన్ మమతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. మృతురాలు వారం రోజుల క్రితమే బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరి, టీచర్స్ కాలనీలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటోంది. బుధవారం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, సంబంధిత అంశాలపై అధికారులు కూడా విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Hostel Students | హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న వరుస ఘటనలు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *