అక్షరటుడే, వెబ్డెస్క్: Koheda Fish Market | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని మంత్రి శ్రీహరి సూచించారు. వారి సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ముదిరాజుల సంక్షేమం కోసం పాటుపడుతానని తెలిపారు. ముదిరాజుల అభివృద్ధి కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవికే కాదు.. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు.
Koheda Fish Market | తెలంగాణకు గర్వకారణం
తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టంగా నిలిచే కోహెడలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. సముద్రతీర ప్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా అంతర్గత రాష్ట్రంలో ఇటువంటి ఆధునిక ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కావడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం, వారికి శాశ్వత ఉపాధి కల్పించడం, అంతర్జాతీయ మార్కెట్లకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో సుమారు రూ.47 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Koheda Fish Market | మెరుగైన ధరలు

తెలంగాణ ప్రస్తుతం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి తెలిపారు. 2025లో రాష్ట్రంలో సుమారు 4.20 లక్షల టన్నుల చేపలు, 15 వేల టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి నమోదైందని వెల్లడించారు. ఈ ఎగుమతుల కేంద్రం అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు లభించి మత్స్యకారులకు మెరుగైన ధరలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో ఆధునిక శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, శిక్షణా కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు, భారీ హోల్సేల్ మార్కెట్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేనస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Sugar Factory Pollution | చక్కెర ఫ్యాక్టరీపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు