అక్షరటుడే, వెబ్డెస్క్: DSP Bheem Reddy | అవినీతి ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్న డీఎస్పీ భీంరెడ్డి కేసులో విచారణకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న డైరీలో పలు కొత్త అంశాలు నమోదైనట్లు సమాచారం.
దర్యాప్తు సంస్థకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ డైరీలో ఓ టాలీవుడ్ హీరో పేరు నమోదు అయి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ నటుడికి రూ.3 కోట్ల మేర అప్పు ఇచ్చినట్లు డైరీలో నమోదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
DSP Bheem Reddy | బినామీల పేర్లు..
డైరీలో భారీ మొత్తంలో ఆస్తులకు సంబంధించిన బినామీల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు, డైరీలో పేర్లు నమోదైన ప్రతి వ్యక్తిని విచారించి వాస్తవాలను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ORR Blackspots | ORRపై ప్రమాదాలకు చెక్.. 80 బ్లాక్స్పాట్స్పై ప్రత్యేక నిఘా!
అయితే, డైరీలో పేర్లు ఉండటం మాత్రమే సంబంధిత వ్యక్తులపై ఆరోపణలు రుజువైనట్లుగా భావించరాదని, విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.