Gold Loan Fraud | గోల్డ్​ లోన్​ పేరుతో.. రూ.10 కోట్ల బంగారం కాజేసిన మేనేజర్​

ముత్తూట్​ ఫైనాన్స్​ మేనేజర్​ ప్రియాంక రెడ్డి కస్టమర్ల గోల్డ్​ను మరోసంస్థకు మళ్లించి రూ.పది కోట్ల మేర దోపిడీకి పాల్పడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Loan Fraud | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ముత్తూట్​ ఫైనాన్స్​ మేనేజర్​ ప్రియాంక రెడ్డి కస్టమర్ల గోల్డ్​ను మరోసంస్థకు మళ్లించి.. రూ.పది కోట్ల మేర దోపిడీకి పాల్పడింది.

కేపీహెచ్‌బీ (KPHB) కాలనీలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్​లో పలువురు బంగారంపై లోన్లు తీసుకున్నారు. అయితే తక్కువ వడ్డీకి లోన్​ ఇప్పిస్తానని మేనేజర్​ ప్రియాంక వారిని నమ్మించింది. సంస్థలోని బంగారాన్ని మరో సంస్థకు బదిలీ చేసింది. ఇలా 40 మందికి సంబంధించిన రూ.10 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె మరో సంస్థకు మళ్లించి దోపిడీకి పాల్పడింది.

Gold Loan Fraud | బంగారం ఇవ్వకపోవడంతో..

సాధారణంగా బంగారం రుణాల వడ్డీ 12 నుంచి 14 శాతం ఉంటుంది. అయితే 6 శాతానికే ఇస్తామని ప్రియాంక నమ్మించారు. దీంతో చాలా మంది చెప్పినట్లు చేశారు. అంతేకాకుండా వడ్డీ డబ్బులను ప్రతి నెలా ఆమె తన వ్యక్తిగత ఖాతాలో వేయించుకున్నారు. బంగారం విలువ పెరగడంతో దానిపై ఆమె టాప్​ఆప్​ లోన్​ కూడా తీసుకున్నారు. ఆ డబ్బులను కస్టమర్లకు ఇవ్వలేదు. అయితే పలువురు కస్టమర్లు ఇటీవల డబ్బులు చెల్లించారు. తిరిగి బంగారం ఇవ్వమంటే ప్రియాంక ఇవ్వలేదు. ఆమె తప్పించుకు తిరుగుతండటంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

Gold Loan Fraud | కేసు నమోదు

కేపీహెచ్​బీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంకరెడ్డి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బ్యాంకులు, ఫైనాన్స్​ సంస్థల సిబ్బంది సైతం మోసం చేస్తే ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి: Harish Rao Counter | ఒట్టేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పను.. సీఎంకు హరీశ్​రావు కౌంటర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *