Malkajgiri Police Meeting | మరింత భద్రత.. పరిశుభ్రతపై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ చర్యలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malkajgiri Police Meeting | హైదరాబాద్​లోని మల్కాజ్‌గిరి ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ మేరకు మల్కాజ్‌గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి అధ్యక్షతన మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

Malkajgiri Police Meeting | మాదకద్రవ్యాల నియంత్రణ

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మహిళలు–పిల్లల రక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సీసీటీవీ కెమెరాల విస్తృత ఏర్పాటు వంటి అంశాలపై అధికారులు సమీక్షించారు.

ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్, మున్సిపల్ శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజా భద్రత పెంపు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల్లో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

Trump Iran Ceasefire | ఇరాన్‌తో చర్చలకు అమెరికా అంగీకారం..’కాల్పుల విరమణ ముగిసింది’ అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

akshara today .jpgcommissi

Malkajgiri Police Meeting | సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు..

ప్రాంతంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడంతో పాటు, ప్రజల భాగస్వామ్యంతో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మల్కాజ్‌గిరి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా రెండు శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *