అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Hostels | జిల్లాలోని హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు సురక్షితమైన, స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు వారి మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
Kamareddy జిల్లాలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
Kamareddy Hostels | మానసిక ఒత్తిడి గుర్తించి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్యా ధోరణులను ముందుగానే గుర్తించి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యార్థుల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ప్రతి హాస్టల్‌లో హాస్టల్ వెల్ఫేర్ అధికారి (HWO) ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ విద్యార్థులతో పీర్ గ్రూపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బృందాలు తోటి విద్యార్థుల ప్రవర్తన, మానసిక పరిస్థితిని గమనించి ఏవైనా సమస్యలు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
Kamareddy Hostels | ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి రోజు సాయంత్రం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా విద్యా సంవత్సరం తొలి మూడు నెలల పాటు కొత్తగా చేరిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రిన్సిపల్స్, వార్డెన్లు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, గురుకులాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అడిషనల్ కలెక్టర్ ఎన్.వై. గిరి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Telangana EHS Health Cards | 15 నుంచి ఉద్యోగుల హెల్త్ స్కీం (EHS) అమలు.. త్వరలోనే సీఎం చేతుల పంపిణీ