అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్–అమెరికా పరసర్పం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. వారు తనను చంపాలనుకుంటే క్షిపణుల వర్షం తప్పదని హెచ్చరించారు.
సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ట్రంప్‌ను చంపాలంటూ బహిరంగంగా పిలుపులు రావడంతో, శనివారం డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఇరాన్ ప్రభుత్వం తన బెదిరింపును ఆచరణలో పెడితే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై 1000 క్షిపణులు గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయి, వెంటనే మరిన్ని వేల సంఖ్యలో వాటిని అనుసరిస్తాయి అని పోస్ట్ చేశారు. హర్ముజ్ జలసంధి తెరిచే ఉందని, ఈ కీలకమైన మార్గం గుండా వెళ్లే నౌకలపై ఇకపై దాడులు జరగవని ఇరాన్ బహిరంగ ప్రకటన చేయాలని అమెరికా ఉన్నతాధికారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Trump Warning | పోస్టర్ల ప్రదర్శన
తనను హత్య చేస్తామని, లేదా హత్యాయత్నం చేస్తామని వచ్చిన బెదిరింపుల కారణంగానే తాను ఈ దాడి చేశానని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఖమేనీ అంత్యక్రియల సమయంలో, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఆయనను కూడా చంపాలని కోరుతూ సంతాపకులు పదేపదే పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శించారు. అమెరికా సైన్యం ఇరాన్‌లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా నాశనం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Trump Iran Ceasefire | ఇరాన్‌తో చర్చలకు అమెరికా అంగీకారం..’కాల్పుల విరమణ ముగిసింది’ అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు