అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jaggareddy | మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. అక్కడ తన భార్య నిర్మల పోటీ చేస్తుందని తెలిపారు.
జగ్గారెడ్డి శనివారం ఉదయం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తాను ఎన్నికల్లో పోటీ చేయను అనడం లేదన్నారు. పార్టీ ఆలోచన బట్టి నేను నడుచుకుంటానని తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే హరీష్‌రావుపై పోటీ చేస్తానని ప్రకటించారు. జగ్గారెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పలుమార్లు ఆయన మాట్లాడుతూ.. ఇక ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తాజాగా ఇతర ప్రాంతాల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం.
Jaggareddy | ఆట మొదలు పెట్టిన సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆట మొదలు పెట్టారని జగ్గారెడ్డి అన్నారు. 117 సీట్లు గెలిపించుకునే ప్లాన్ చేశారన్నారు. ఆయన వ్యూహాలు, నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. రేవంత్ ఆలోచనలతో తమకు ఏకాభిప్రాయం ఉంటుందన్నారు. సీట్లు ఎవరికి ఇవ్వాలనే అంశం సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయాన్ని బట్టి ఉంటుందని వెల్లడిచారు. రెండవ సారి ప్రభుత్వం తెచ్చేందుకు నిర్ణయాలు తీసుకునే హక్కు రేవంత్‌కు ఉందన్నారు. ఎవరి సర్వేలు వారికి అనుకూలంగా చేస్తారని పేర్కొన్నారు. సర్వేలను చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు.
ఇది కూడా చదవండి..: Duplicate Voter ID | రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు..