Nizamabad MLA | పేదల ఆరోగ్యానికి పెద్దపీట: ఎమ్మెల్యే ధన్​పాల్​

నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్​లో ఎల్​వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad MLA | నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్​లో ఎల్​వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (MLA Dhanpal Surya Narayana) తెలిపారు. నగరంలోని కార్యాలయంలో ఆదివారం బాధిత కుటుంబానికి ఎల్​వోసీ అందజేశారు.

Nizamabad MLA | ఎల్​వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్​వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఆటో నగర్​కు చెందిన మూడున్నరేళ్ల బాలిక ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్నారన్నారు. దీంతో నిమ్స్​లో (NIMS) చికిత్స కోసం రూ.5లక్షల ఎల్​వోసీ వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమన్నారు.

Nizamabad MLA | ఎయిమ్స్​లో అత్యాధునిక వైద్య సేవలు..

హైదరాబాద్​లోని ఎయిమ్స్​లో అత్యాధునిక సేవలు అందుబాటు వచ్చాయన్నారు. పేదలు దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉన్నవారు, అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన వారు ఎయిమ్స్​కి వెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూ.వేయి కోట్లతో నిర్మించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. 132 మంది ప్రొఫెసర్లు, 133 మంది సీనియర్ డాక్టర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.  నియోజకవర్గ ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియం చేసుకోవాలని కోరారు.

nizamabad City

ఇది కూడా చదవండి: #Maharashtra ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న #PawanKalyan ను #ApCm నారా #ChandraBabu నాయుడు పరామర్శించారు.

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *