అక్షరటుడే, వెబ్డెస్క్: Road Accident | మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల లోడుతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.
బండమీదిపల్లి ఆర్టీవో కార్యాలయం సమీపంలో కోయిలసాగర్ నుంచి వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో ముజాయిద్(38), జిలాని(45) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అజహార్‌ను 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident | చెట్టును ఢీకొన్న బైక్
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ బైక్ బలంగా చెట్టును ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గాదరాడ గ్రామం నుంచి కోరుకొండ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాదరాడకు చెందిన నక్కా అంజన్న (30), సాడిపల్లి వీర దుర్గా (26), కుర్రం నాగు (24) మృతి చెందారు.
ఇది కూడా చదవండి..: Kollapur Principal Assault | విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికిన విద్యార్థి