నిజామాబాద్Banswada Government Hospital | బాన్సువాడలో విషాదం.. గొంతులో ఇడ్లీ ఇరుక్కొని బాలింత మృతి

Banswada Government Hospital | బాన్సువాడలో విషాదం.. గొంతులో ఇడ్లీ ఇరుక్కొని బాలింత మృతి

బాన్సువాడలో విషాదం చోటుచేసుకుంది. పండంటి బిడ్డను ప్రసవించిన బాలింతను ఇడ్లీ రూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది.

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Government Hospital | బాన్సువాడలో (Banswada) విషాదం చోటుచేసుకుంది. పండంటి బిడ్డను ప్రసవించిన బాలింతను ఇడ్లీ రూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో(Government Hospital) శుక్రవారం చోటు చేసుకుంది.

Banswada Government Hospital | ప్రసవించిన కొద్ది సేపటికే..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం(Pitlam) మండలం బండపల్లికి చెందిన అర్చన బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించింది. అయితే ప్రసవం తర్వాత ఆమె ఇడ్లీ తింటుండగా గొంతులో ఇడ్లీ అడ్డుపడి ఊపిరాడక ఆస్పత్రిలోనే ఆమె ఉక్కిరిబిక్కిరైంది. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఆమె మృతి చెందింది. బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి (Kamareddy District Hospital) తరలించారు. బిడ్డ జన్మించిన కొద్దిసేపటికే తల్లి అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ మాట్లాడుతూ.. డెలివరీ తర్వాత అర్చనకు ఇడ్లీ ఇవ్వగా.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస ఆడక మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Kejriwal Tweet | పంజాబీలను దెబ్బకొట్టిన బీజేపీ.. ఎంపీల జంప్‌పై కేజ్రీవాల్ ఘాటు ట్వీట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...