Bail Promise Theft | బెయిల్​ ఇప్పిస్తానని చెప్పి గుండ్లు దోచుకెళ్లాడు.. 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

బెయిల్​ ఇప్పిస్తానని ఇంట్లోకి దూరి మాయమాటలు చెప్పి మహిళ మెడలోని బంగారు గుండ్లను ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bail Promise Theft | కొడుకుకు బెయిల్​ ఇప్పిస్తానని ఇంట్లోకి దూరి మాయమాటలు చెప్పి మహిళ మెడలోని గుండ్లను దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ దోపిడీ కేసును ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే చోరీకి గురైన సొత్తును రికవరీ చేశారు.

Bail Promise Theft | లింగారెడ్డి పేట్​ గ్రామంలో..

ఎల్లారెడ్డి పోలీసులు (Yellareddy Police) తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 11న లింగారెడ్డిపేట్‌కు చెందిన పుర్ర కాశవ్వ ఇంటి వద్దకు ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. కాశవ్వ కొడుకు బెయిల్ కోసం డబ్బులు అడిగాడంటూ నమ్మించి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం అక్కడ ఉన్నవారితో కలిసి కల్లు తాగి, వారు నిద్రిస్తున్న సమయం చూసి దాడికి తెగబడ్డాడు. బాధితురాలు తలారి దుర్గవ్వ మెడలోని 12 గ్రాముల బంగారు గుండ్ల తాడు, పక్కనే ఉన్న కుక్కల పోశవ్వ చేతికున్న 40 గ్రాముల వెండి కడెం బలవంతంగా లాక్కుని పరారయ్యాడు.

Bail Promise Theft | వేగంగా స్పందించిన పోలీసులు

బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్.శ్రీనివాస రావు ఆదేశాలతో, సీఐ రాజారెడ్డి, ఎస్సై రాజుల బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు నీరుడి సాయిలును సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుంచి బంగారు గుండ్ల తాడు, వెండి కడెంను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Mettu Samson Nizamabad Congress | కాంగ్రెస్​లో ముప్పై ఏళ్ల నమ్మకానికి మిగిలింది అవమానాలేనా? నిజామాబాద్ రూరల్‌లో ఓ సీనియర్​ నేత ప్రశ్న.. నెట్టింట వైరల్​!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *