Banswada Mother Hospital | వైద్యుల నిర్లక్ష్యంపై బీఆర్​ఎస్​ ఆగ్రహం.. బాన్సువాడ మాతా-శిశు ఆస్పత్రి ఎదుట ధర్నా

బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై బీఆర్​ఎస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Mother Hospital | బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై బీఆర్​ఎస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో మాతా–శిశు ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.

Banswada Mother Hospital | గర్భిణులు అస్వస్థతకు గురి కావడంపై..

బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గత శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో పదిమంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించగా, వారిలో ఐదుగురు బాలింతలు ఆపరేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. వారిని మొదట నిజామాబాద్‌ (Nizamabad)కు, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాల్సి వచ్చిందని తెలిపారు. ముగ్గురికి కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకడంతో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనలకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన నాయకులు, గత కొంతకాలంగా ఆస్పత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని విమర్శించారు.

Banswada Mother Hospital | అందుబాటులో ఉండని వైద్యులు..

Banswada Mother Hospital

వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండడం లేదని, అవసరమైన మందుల కొరత ఉందని, గర్భిణులు, నవజాత శిశువులకు నిర్వహించాల్సిన పరీక్షలు, టీకాలు కూడా సక్రమంగా జరగడం లేదని బీఆర్​ఎస్​ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బాధ్యులపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, బాడి శ్రీనివాస్, ఖలీల్, అక్బర్, ఫిరోజ్, గణేష్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sarpanch Husband Interference | ‘ఆమె’ స్థానంలో దర్జాగా..! హద్దు మీరుతున్న కొందరు ‘సర్పంచ్ భర్తలు’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *