అక్షరటుడే వెబ్‌డెస్క్: Kannepalli Pump House | కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ క్రమంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏ చిన్న సమస్య ఎదురైనా, తాము అందరం బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయము. ఈ సవాల్‌ను స్వీకరించే ధైర్యం ముఖ్యమంత్రికి, మంత్రికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆవేదనను చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
Kannepalli Pump House | రైతులకు నీరివ్వండి..
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై సీఎం ఎదురుదాడి చేస్తున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం కాళేశ్వరంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ, కన్నెపల్లి పంప్ హౌస్‌లను కావాలనే ఆన్ చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తల రక్తం తీసుకునైనా రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.
Kannepalli Pump House | పంటలు కొనాల్సి వస్తుందనే భయంతో..
నీళ్లు ఇస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని, పంటలు కొనాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం రైతులకు నీటిని అందించడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేయడమే రైతులు చేసిన తప్పా అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షపై బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
🔥 “చేతనైతే నీళ్లు లిఫ్ట్ చేయండి.. రూపాయి నష్టం వచ్చినా రాజీనామా చేస్తాం!” రేవంత్, ఉత్తమ్‌లకు పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్! 🔥#KaushikReddy #RevanthReddy #Kaleshwaram #BRSVsCongress #TelanganaPolitics pic.twitter.com/do6JetKJVY
— The 4th Estate (@The4thestateTv) July 14, 2026
ఇది కూడా చదవండి: Warangal Airport | వేగవంతం కానున్న ఎయిర్‌పోర్టుల పనులు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన