AO Srihari Murder | ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని మలుపు… నిందితుడి కుటుంబంతో సహా ఆత్మహత్య

ఏపీలో సంచలనం సృష్టించిన ఏవో (AO) శ్రీహరి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: AO Srihari Murder | ఏపీలో ( Andhra Pradesh )సంచలనం సృష్టించిన ఏవో (AO) శ్రీహరి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీహరి బావమరిది హరికృష్ణ, తన భార్య మరియు పిల్లలతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి వారు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు హరికృష్ణ కుటుంబ సభ్యులని పోలీసులు నిర్ధారించారు.

AO Srihari Murder | హత్య జరిగిన తీరు..

బుచ్చిరెడ్డిపాలెం మండల ఏవోగా పనిచేస్తున్న శ్రీహరిని ఆస్తి కోసం సొంత బావమరిది హరికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. శ్రీహరి తన ఆస్తిని, అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి అడగడంతో హరికృష్ణ అతడిని అంతమొందించాలని పథకం వేశాడు. జూన్ 15న దైవదర్శనానికి వెళ్తున్నామని నమ్మించి, తన స్నేహితులైన రవీంద్ర, యానాదుల సాయంతో కారులో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో కారును ఆపి, కుక్కలను చంపేందుకు ఉపయోగించే ప్రమాదకరమైన ఇంజెక్షన్లను శ్రీహరికి ఇచ్చి హత్య చేశారు. ఆ తర్వాత, శ్రీహరి గుండెపోటుతో మరణించాడని నమ్మించేందుకు మృతదేహాన్ని వారి సొంత ఊరు మినగల్లుకు తరలించారు.

AO Srihari Murder | పోలీసు దర్యాప్తు ..

మృతిపై తోటి ఉద్యోగులకు అనుమానం వచ్చినా, మొదట్లో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయితే, ఇటీవల హరికృష్ణ మిగిలిన ఆస్తిని కూడా తనకే రాసివ్వాలని శ్రీహరి భార్య లావణ్యను వేధించడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఎస్పీ కార్యాలయంలో లావణ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. తన నేరం బయటపడటంతో పాటు, చట్టం నుంచి తప్పించుకోలేననే భయం, తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే హరికృష్ణ తన భార్య, పిల్లలతో కలిసి సింగరాయకొండ రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

AO Srihari Murder | దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు..

శ్రీహరి మృతదేహాన్ని సహజంగా పూడ్చిపెట్టకుండా, హరికృష్ణ కుటుంబ సభ్యులు కాల్చివేయడం అప్పట్లోనే అనుమానాలకు దారితీసింది. ఇప్పుడు నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి:  Ketan Agarwal Murder | ప్రధాని మోదీకి కేతన్ తల్లి లేఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *