అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gandhi Medical College Vice Principal | సికింద్రాబాద్‌లోని ప్రముఖ గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ (అకడమిక్-యూజీ)గా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగ అధిపతి (హెచ్‌ఓడీ), ప్రొఫెసర్ డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ కె. ఇందిర ఉత్తర్వులు జారీ చేశారు.
Gandhi Medical College Vice Principal |
ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్, విభాగాధిపతి బాధ్యతలతో పాటు అదనంగా ఈ వైస్ ప్రిన్సిపల్ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కళాశాల యాజమాన్యం నిన్న (జులై 13, 2026) విడుదల చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రతిని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, కళాశాలలోని అన్ని విభాగాలు, అకౌంట్స్ సెక్షన్‌కు సమాచారం నిమిత్తం పంపించారు. డాక్టర్ నాగమోహన్ రావు వైస్ ప్రిన్సిపల్‌గా నియమితులవడం పట్ల కళాశాల అధ్యాపకులు, వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశారు.
Gandhi Medical College Vice Principal | గతంలో నిజామాబాద్‌లో బాధ్యతలు..
డా.నాగమోహన్ ఇంతకు ముందు Nizamabad మెడికల్ కళాశాలలో (Medical College Nizamabad) ఫోరెన్సిడ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన్ను కు ప్రభుత్వం జీజీహెచ్ (Government General Hospital Nizamabad) ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ సందర్భంగా ఆస్పత్రిని గాడిన పెట్టేందుకు ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత గాంధీ మెడికల్ కళాశాల (Gandhi Medical College) ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. తాజాగా గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు.