Enumeration Forms | ఎన్యుమరేషన్ ఫారాలను త్వరితగతిన సమర్పించాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలు త్వరగా బీఎల్​వోలకు అందజేయాలని కలెక్టర్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Enumeration Forms | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలు త్వరగా బీఎల్​వోలకు అందజేయాలని కలెక్టర్​ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

Enumeration Forms | డిజిటలైజేషన్​ చేయాల్సి ఉన్నందున..

ఎన్యుమరేషన్​ ఫారాలను వివరాలను డిజిటలైజ్ చేయాల్సి ఉన్నందున ఫారాలను వెంటనే తిరిగి ఇచ్చేయాలని కలెక్టర్​ (Collector Ila Tripathi) కోరారు. అంతేకాకుండా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్/డిలీటెడ్ (ఏఎస్డీ) ఓటర్ల జాబితాను సైతం రూపొందించాల్సి ఉన్నందున చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటదివెంట ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్​వోలకు అందించాలని సూచించారు. ప్రత్యేకించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు ఫారం అందజేసే విషయంలో తాత్సారం చేయవద్దని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారం అందించకపోతే ఓటరు జాబితా నుంచి పేరు గల్లంతు అవుతుందని తెలిపారు.

Enumeration Forms | 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే..

Enumeration Forms

ఒకవేళ ఎవరికైనా గత 2002 ఎస్ఐఆర్ వివరాలు తెలియకపోతే సర్కిల్ వారీగా నెలకొల్పిన హెల్ప్ డెస్క్​ను, లేదా బీఎల్​వోలను సంప్రదించాలని సూచించారు. అయినప్పటికీ వివరాలు తెలియని పక్షంలో ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపర్చి ఫారం సమర్పించవచ్చని అన్నారు. అలాంటి వారి పేరు కూడా ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చబడుతుందని తెలిపారు. వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్వో) నోటీసు జారీ చేసి హియరింగ్​కు పిలుస్తారన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు ధృవీకరణ పత్రాలలో ఏదైనా ఒక దానిని చూపిస్తే ఓటరు తుది జాబితాలో పేరు చేరుస్తారని అన్నారు.

Enumeration Forms | బీఎల్​ఏలు చురుకుగా స్పందించాలి..

ఈ విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ఉంటూ క్రియాశీలక పాత్ర పోషించాలని, ప్రతి రోజు ఓటర్ల నుండి 50 చొప్పున ఫారంలు సేకరించి బీఎల్​ఏలకు అందించేలా చొరవ చూపాలన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్​వో కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎన్యుమరేషన్ ఫారంల సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియలు వేగవంతం అయ్యేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అందుబాటులో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించి, వాటిపై బీఎల్ఏల సంతకాలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Rice Exports | ఎల్లలు దాటుతున్న ఇందూరు బియ్యం.. యూకేకు ఎగుమతులు ప్రారంభించిన కలెక్టర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *