అక్షరటుడే, ఇందూరు: SIR Revision Process | స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana) సూచించారు. నగరంలోని (Nizamabad) 28వ డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు.
SIR Revision Process |ఎస్ఐఆర్లో ప్రతిఒక్కరిని భాగస్వామ్యులను చేయాలి
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కాబట్టి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా ఎన్యుమరేషన్ పత్రాలను పూర్తిచేసి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలన్నారు. అనేకమందికి ఎన్యుమరేషన్ ఫామ్ నింపడంలో గందరగోళం ఏర్పడుతుందని, కావున ఓటర్లకు బీఎల్వోలు, పార్టీ బీఎల్ఏలు సహకరించాలని సూచించారు. కార్పోరేటర్ల సైతం తమ పరిధిలోని ఓటర్లకు తగు సూచనలు చేస్తూ ఎన్యుమరేషన్ ఫారాలను నింపి తిరిగి ఇచ్చేలా చూడాలన్నారు.
SIR Revision Process | ఎస్ఐఆర్ గడువు పెంపు
కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ గడుపును ఈ నెల 24 నుంచి ఆగస్టు 3వ తేదీకి పొడిగించిందని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలోని ఓటర్లందరూ గమనించి నిర్ణీత గడువులోపు ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బీఎల్వోలకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్కాయి మహేందర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: CC Footage | షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పడిన చిన్నారి..