Youth Suicide Case | వేధింపులతో యువకుడి ఆత్మహత్య..

ప్రేమించిన బాలిక తరపు వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Youth Suicide Case | ప్రేమించిన బాలిక తరపు వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దోమకొండ మండలం (Domakonda Mandal) చింతమాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Youth Suicide Case | చింతామాన్​పల్లిలో..

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రంగబోయిన సందీప్(23) ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయంలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏడాది క్రితం అతనిపై పోక్సో కేసు నమోదైంది. ఆ కేసులో సందీప్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత కూడా సందీప్ తమ కూతురికి ఫోన్ ద్వారా మెసేజ్‌లు పంపుతున్నాడని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు అతడిని బెదిరించారు. ఇక నుంచి సంప్రదించవద్దని గట్టిగా హెచ్చరిస్తూ మెసేజ్‌లు కూడా పంపారు. ఈ అంశంపై బాలిక తల్లిదండ్రులు మరోసారి దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఎస్సై ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Youth Suicide Case | మనస్తాపానికి గురై..

ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్ గ్రామ శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొందరు వ్యక్తుల బెదిరింపులు, వేధింపుల వల్లే తమ కుమారుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని సందీప్ తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సందీప్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దోమకొండ ఎస్సై ప్రభాకర్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: MeeSeva Irregularities | ‘మీసేవ’లలో అక్రమాలు.. రంగంలోకి దిగిన విజిలెన్స్​ బృందాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *