నిజామాబాద్Yellareddy Municipality | మాట తప్పని కౌన్సిలర్​.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న సిద్ధి శ్రీధర్​...

Yellareddy Municipality | మాట తప్పని కౌన్సిలర్​.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న సిద్ధి శ్రీధర్​ గుప్తా

హామీలు ఇచ్చి మరిచిపోయి.. మభ్యపెట్టే ఈ రోజుల్లో.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ శభాష్​ అనిపించుకుంటున్నారు కౌన్సిలర్​ సిద్ధి శ్రీధర్​ గుప్తా. ఎల్లారెడ్డి పట్టణంలో 8వ వార్డు నుంచి స్వతంత్ర కౌన్సిలర్​గా గెలిచిన ఆయన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipality | హామీలు ఇచ్చి మరిచిపోయి.. మభ్యపెట్టే ఈ రోజుల్లో.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ శభాష్​ అనిపించుకుంటున్నారు కౌన్సిలర్​ సిద్ధి శ్రీధర్​ గుప్తా. ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణంలో 8వ వార్డు నుంచి స్వతంత్ర కౌన్సిలర్​గా గెలిచిన ఆయన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.

Yellareddy Municipality | ఎల్లారెడ్డి పట్టణంలో..

రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) సిద్ధి శ్రీధర్ గుప్తా ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం సొంత నిధులతో బోరుబావి తవ్వించారు. మున్సిపల్ ఎన్నికల్లో తన సొంత మ్యానిఫెస్టో ప్రకటించి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో సిద్ది శ్రీధర్ గుప్తా భారీ మెజారిటీతో విజయం సాధించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్(Congress), బీజేపీ(Bjp), బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులు గుప్త చేతిలో పరాజయం పాలయ్యారు. ఆడపిల్ల పెళ్లికి రూ.11వేలు ఇస్తానన్న హామీని నెరవేరుస్తూ.. వార్డుకు చెందిన ఇద్దరు పెళ్లి కూతుళ్లకు రూ.22వేలు అందించారు.

అలాగే ఆడబిడ్డ పుడితే రూ.10వేలు ఇస్తానని ప్రకటించి ఆ హామీని సైతం నెరవేర్చారు. ఫ్రీజర్ సైతం వార్డ్​లో ఏర్పాటు చేశారు. తన వార్డులోని ఉప్పర్ గల్లీలో(Yellareddy Town) నీటి ఎద్దడి తీర్చేందుకు సొంత నిధులతో బోరుబావి తవ్విస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. ఏళ్ల తరబడి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఉప్పర్​గల్లీ వాసులకు రూ.వేలల్లో ఖర్చు చేసి బోరుబావి తవ్వించడంపై గల్లీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంతమందికే సాధ్యమని, అందులో సిద్ధి శ్రీధర్ గుప్తా వంటి వారు అరుదు అని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

22 2

33 2

ఇది కూడా చదవండి: CV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....