KTR Youth Sangrama | రేపే ‘యువ సంగ్రామ సదస్సు’.. యువత పెద్దఎత్తున తరలిరావాలి: కేటీఆర్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KTR Youth Sangrama | కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామ సదస్సు’కు యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

BRS Yuva Sangrama Sabha | బీఆర్​ఎస్​కు షాక్​.. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ

KTR Youth Sangrama | యువత గొంతుకను బలంగా వినిపిద్దాం

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం (జులై 18) ఉదయం 10 గంటలకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొంటూ, యువత తమ హక్కుల కోసం ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

“కలిసి నడుద్దాం.. యువత గొంతుకను బలంగా వినిపిద్దాం” అంటూ యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున సదస్సుకు తరలిరావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, యువజన నాయకులు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

KTR

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *