అక్షరటుడే, బాన్సువాడ: Teacher Harassment | విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి చేర్చాల్సిన కొందరు ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల కారణంగా తల్లిదండ్రుల్లో ఆందోళన ఏర్పడుతోంది.
Teacher Harassment | బాన్సువాడ మండలంలో..
తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy District) బాన్సువాడ మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులపై వచ్చిన ఫిర్యాదులు కలకలం రేపాయి. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గోపాల్, పవన్ అనే ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో విద్యార్థినుల ఆరోపణలు నిజమేనని తేలడంతో వారిద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ తెలిపారు. అలాగే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Ambedkar Open University | డ్రాపౌట్స్‌కు దగ్గరవుతున్న దూరవిద్య.. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పెరుగుతున్న ప్రవేశాలు