అక్షరటుడే, వెబ్‌డెస్క్ : FIFA World Cup | ఫిఫా వరల్డ్ కప్ – 2026 విజేతగా స్పెయిన్ నిలిచిన విషయం తెలిసిందే. కప్ గెలిచిన ఆ దేశానికి రూ.420 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్ అర్జెంటీనాకు రూ.277 కోట్ల ప్రైజ్‌మనీ రానుంది.
న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో స్పెయిన్ ఘన విజయం సాధించింది. నిర్ణిత సమయంలో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలో స్పెయిన్ (Spain) గోల్ కొట్టి మ్యాచ్ గెలిచింది. ఆ దేశ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ ఈ ఏడాది ప్రపంచ కప్‌లో తన మొదటి గోల్‌ను సాధించడంతో పాటు దేశానికి కప్‌ను అందించాడు. రెడ్ కార్డుతో ఎంజో ఫెర్నాండెజ్‌ను మైదానం నుండి పంపించివేయడంతో అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లకే పరిమితమైన సమయంలో ఈ గోల్ నమోదైంది. స్పెయిన్‌కు ఇది రెండో ప్రపంచ కప్. 2010లో ఆ దేశంలో తొలిసారి కప్ గెలిచింది.
FIFA World Cup | ప్రైజ్ మనీ వివరాలు..
ఫిపా ప్రపంచ కప్ కోసం ఫీఫా కౌన్సిల్ 727 మిలియన్ డాలర్ల ఆర్థిక కేటాయింపును ఆమోదించింది. ఇందులో పాల్గొంటున్న 48 జట్లకు 655 మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీగా కేటాయించారు. రన్నరప్ అర్జెంటీనా – 33 మిలియన్ డాలర్లు, 3వ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌కు 29 మిలియన్ డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌కు 27 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ రానుంది. ఈ మెగా టోర్నీలో ప్రతిభ కనబర్చిన స్పెయిన్ ఆటగాడు రోడ్రీ గోల్డెన్ బాల్ దక్కించుకున్నాడు. అర్జెంటినా దిగ్గజం మెస్సీ సిల్వర్ బాల్, ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబాపే బ్రాంజ్ బాల్ గెలుచుకున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబాపే గోల్డెన్ బూట్ , లియోనెల్ మెస్సీ సిల్వర్ బూట్ దక్కించుకున్నారు.
ఇది కూడా చదవండి..: US Iran Conflict | అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు