PCC Chief Visit | ఉమామహేశ్వరాలయంలో పీసీసీ చీఫ్​ ప్రత్యేక పూజలు

నిజామాబాద్​ నగరంలోని ఉమామహేశ్వర ఆలయంలో పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Chief Visit | నగరంలో(Nizamabad) పీసీసీ చీఫ్​  బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్ (MLC Mahesh Kumar Goud)​ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

PCC Chief Visit | రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని..

ఆలయంలో అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య జలాభిషేకం(Jalabhishekam) చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు మహేశ్​ గౌడ్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

pcc1

ఇది కూడా చదవండి: నిమ్స్ ఆస్పత్రిలో బాలింతలను పరామర్శించిన హరీష్ రావు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *