Millworks Technologies IPO | అదరగొట్టిన ఐపీవో.. లిస్టింగ్ రోజే రెట్టింపైన సంపద

సబ్‌స్క్రిప్షన్ సమయంలోనే ఊరించిన మిల్‌వర్క్స్ టెక్నాలజీస్ ఎస్ఎంఈ ఐపీవో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఒక్కరోజులోనే పెట్టుబడి దాదాపు రెట్టింపయ్యింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Millworks Technologies IPO | మిల్‌వర్క్స్ టెక్నాలజీస్ అనేది ప్రిసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ. ఇది రైల్వేలు, ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీకండక్టర్స్ వంటి కీలక రంగాల్లో ఉపయోగించే యంత్ర భాగాల్ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ ద్వారా రూ. 160.34 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఇది ఎస్ఎంఈ సెగ్మెంట్‌కు చెందినది. ఒక్కో లాట్‌లో 400 షేర్లున్నాయి. గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్ల కోసం రూ. 2,64,800 తో బిడ్లు వేయాల్సి ఉంటుంది.

Millworks Technologies IPO | భారీ స్పందన..

ఈ కంపెనీకి మొదటినుంచి గ్రే మార్కెట్ ప్రీమియం భారీగా ఉండడంతో భారీ స్పందన లభించింది. ఐపీవో (IPO) సబ్‌స్క్రిప్షన్ ఈనెల 14న ప్రారంభమై 16న ముగియగా.. మొత్తం 219.54 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ పోర్షనే 216.60 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యిందంటే దీనికి ఎంతటి డిమాండ్ ఉండో అర్థం చేసుకోవచ్చు.

Millworks Technologies IPO | అప్పర్ సర్క్యూట్ ను తాకిన షేరు..

మిల్‌వర్క్స్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు మంగళవారం బీఎస్ఈలో లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ షేరు ధర రూ. 331 కాగా 90 శాతం ప్రీమియంతో 628.90 వద్ద లిస్టయ్యింది. అనంతరం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 660.30 వద్ద స్థిరపడింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి తొలిరోజే దాదాపు రెట్టింపు లాభాలు వచ్చాయన్న మాట.

ఇది కూడా చదవండి..: Vivo T5 Lite | అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫోన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *