MLC Appointments Approval | ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్.. సంతకం చేసిన గవర్నర్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Appointments Approval | రాష్ట్రంలో గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ (Governor Quota MLC)ల నియామకానికి లైన్​ క్లియర్​ అయింది. అజారుద్దీన్, కోదండరాం (Kodandaram) ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం (State Government) గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలుగా గతంలో కోదండరాం, అజారుద్దీన్​ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైల్ చాలా రోజులుగా గవర్నర్​ వద్ద పెండింగ్​లో ఉండిపోయింది. అనంతరం అజారుద్దీన్​ (Azharuddin) మంత్రి అయ్యారు. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ 6 నెలలు పూర్తి కానుంది. ఆలోపు గవర్నర్​ ఎమ్మెల్సీల నియమాకానికి ఆమోదం తెలుపకపోతే ఆయన మంత్రి పదవి కోల్పేయేవారు.

MLC Appointments Approval

MLC Appointments Approval | సీఎం చర్చలతో..

ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదం తెలుపకపోతే అజారుద్దీన్​ మంత్రి పదవి పోతుందని.. స్వయంగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రంగంలోకి దిగారు. గవర్నర్​ శివ్ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla)తో ఇటీవల భేటీ అయ్యారు. ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదం తెలుపాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా గవర్నర్ ఆ ఫైల్​పై సంతకం చేశారు. దీంతో అజారుద్దీన్​ మంత్రిగా కొనసాగనున్నారు.

ఇది కూడా చదవండి..: Child Marriage | బాల్య వివాహానికి ఆపడానికి వెళ్లి.. పెళ్లి కూతురి చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *