Rahul Gandhi Protest | పీఎం నివాసం ఎదుట కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తం..రాహుల్​కు గాయం..ముక్కు నుంచి రక్తం!

రాహుల్ గాంధీని మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rahul Gandhi Protest | ప్రధానమంత్రి Prime Minister నరేంద్ర మోడీ Modi అధికారిక నివాసం సమీపంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.

Family Asset Trust | ఆస్తి రక్షణకు ధనికుల ఫైనాన్స్ సీక్రెట్: తరతరాలుగా సిరిసంపదలను కాపాడే ‘ట్రస్ట్’ విధానం!

Rahul Gandhi Protest | ఫొటోలు నెట్టింట వైరల్​

నిరసన సందర్భంగా రాహుల్ గాంధీని పోలీసులు అక్కడి నుంచి తరలించే క్రమంలో ఆయన ముక్కు వద్ద రక్తస్రావం అయినట్లు కనిపించే ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేసింది.

ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. అయితే గాయానికి సంబంధించిన అధికారిక వైద్య వివరాలు లేదా ఢిల్లీ పోలీసుల నుంచి పూర్తి వివరణ వెలువడాల్సి ఉంది.

Rahul Gandhi Protest | ఎంపీల రిలీజ్​..

అదుపులోకి తీసుకున్న అనంతరం రాహుల్ గాంధీని మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత ఇద్దరినీ విడుదల చేశారు. కాంగ్రెస్ ఎంపీలు, ఇతర నేతలను కూడా పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం.

విద్యార్థుల ఆందోళనలపై జరిగిన పోలీసు చర్యకు నిరసనగా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఘటనతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *